: ఇది ట్రైలర్ మాత్రమే.. అసలైన సినిమా ముందుంది: నారా లోకేష్
అమరావతిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయం కేవలం ట్రైలర్ వంటిది మాత్రమేనని... అసలైన సినిమా ముందుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్రాన్ని విభజించినవాళ్లు సైతం అసూయపడేలా రాజధానిని నిర్మిస్తామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేస్తుంటే... దాన్ని అడ్డుకోవడానికి ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని విమర్శించారు. వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీకి చెందిన ఎంపీ వైవీ సుబ్బారెడ్డి రాసిన లేఖల వల్లే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల్లో జాప్యం జరుగుతోందని మండిపడ్డారు.