: నా కూతురు ఆ పని చేస్తే తల్లిగా ఆనందిస్తా: నటి శ్రీదేవి
బాలీవుడ్ దంపతులు శ్రీదేవి-బోనీకపూర్ ల కూతురు జాన్వీ కపూర్ త్వరలోనే తెరంగేట్రం చేస్తుందనే వార్త మీడియాలో చాలా రోజులుగా హల్ చల్ చేస్తోంది. ఈ విషయాన్ని శ్రీదేవి దంపతులు మాత్రం ఇంతవరకూ అధికారికంగా ప్రకటించలేదు. అయితే, చిత్ర రంగంలో ఓ వెలుగు వెలిగిన శ్రీదేవి నటించిన ‘మామ్’ చిత్రం త్వరలో విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తన కూతురు సినిమాల్లో రాణిస్తే సంతోషమే కానీ, జాన్వీ పెళ్లి చేసుకుంటే చూడటం ఓ తల్లిగా తనకు మరింత ఆనందాన్ని ఇస్తుందని చెప్పింది. జాన్వీ సినిమాల్లో నటించాలని అనుకుంటోందని, మొదట్లో అందుకు తాను ఇష్టపడలేదని చెప్పింది. అలా అని చెప్పి సినీ పరిశ్రమ చెడ్డదని కాదని, తాను అక్కడి నుంచి వచ్చిన దానినేనని శ్రీదేవి తెలిపింది.