: బాసర ఆలయ ప్రాంగణంలో వరాహం!


నిర్మల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలోని శ్రీఙ్ఞాన సరస్వతి ఆలయ ప్రాంగణంలో ఓ వరాహం హల్ చల్ చేసింది. దీంతో, దీనిని పట్టుకునేందుకు ఆలయసిబ్బంది కష్టపడాల్సి చేయాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఆ వరాహాన్ని పట్టుకుని బయట వదిలిపెట్టారు. కాగా, ఆలయ ప్రాంగణంలోకి వరాహం రావడంతో భక్తులు మండిపడుతున్నారు. ఆలయ భద్రతా సిబ్బంది అశ్రద్ధగా వ్యవహరించడం వల్లే ఈ సంఘటన జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఆలయ అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News