: వారు చనిపోయిన తర్వాత ‘పాక్’లో సమాధి చేయాలని కోరుకుంటారా?: ఆప్ నేత కుమార్ విశ్వాస్


ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో భారత్ పై పాక్ విజయం సాధించడంతో కాశ్మీర్ వేర్పాటు వాద నేత మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ సంబరాలు జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేత  కుమార్ విశ్వాస్ తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ, ఇలా సంబరాలు చేసుకునే వారు చనిపోయిన తర్వాత తమ మృతదేహాలను పాకిస్థాన్ లో సమాధి చేయాలని కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు.

కాశ్మీర్ వరదల సమయంలో భారత ఆర్మీ వల్లే ప్రాణాలు దక్కించుకున్న వాళ్లు, ఛాంపియన్స్ ట్రోఫీలో భారతజట్టు ఓటమిపై సంబరాలు చేసుకుంటున్నారా?, అలాంటివాళ్లకు మాతృభూమిపై విధేయత ఉందా? అని కుమార్ విశ్వాస్ తన ట్వీట్ లో మండిపడ్డారు.

  • Loading...

More Telugu News