: అన్నం పెట్టిన చేతికి సున్నం పెట్టిన ఐవైఆర్: బుద్దా వెంకన్న మండిపాటు


అన్నం పెట్టిన చేతికి సున్నం పెట్టిన మనిషి ఐవైఆర్ కృష్ణారావు అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి ఐవైఆర్ కృష్ణారావును తొలగించి సీఎం చంద్రబాబు మంచి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కృష్ణారావు అహంకారంతో మాట్లాడుతున్నారని, చంద్రబాబుకు ఆయన తక్షణం క్షమాపణలు చెప్పాలని ఈ సందర్భంగా బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News