: అలరిస్తున్న అల్లు శిరీష్ రొమాంటిక్ ట్వీట్ వార్!


అల్లు వారబ్బాయి శిరీష్, తన ట్విట్టర్ ఖాతాలో పెట్టిన ఓ రొమాంటిక్ ట్వీట్ క్షణాల్లో వైరల్ కాగా, దానికి అభిమానుల నుంచి వచ్చిన స్పందన, వాటికి శిరీష్ ఇచ్చిన సమాధానాలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. తనకు వర్షం అంటే గిట్టదని, వర్షంలో తనకు ఎలాంటి రొమాంటిక్ ఫీలింగ్స్ కనిపించవని, సూర్యుడు లేకుండా, మబ్బులు పట్టిన వాతావరణంతో తాను డల్ గా మారిపోతానని శిరీష్ ట్వీట్ చేయడంతో, ఈ రొమాంటిక్ ట్వీట్ వార్ మొదలైంది.

 దీనిపై ఓ అభిమాని స్పందిస్తూ, "భయ్యా, మీకు పెళ్లీడు వచ్చింది. పెళ్లి చేసుకుంటే అంతా రొమాంటిక్‌గా అనిపిస్తుంది. రోడ్డు మీద బురద కూడా బ్యూటిఫుల్ గానే ఉంటుంది" అని కొంటె వ్యాఖ్య చేయగా, దానిపై శిరీష్ వెంటనే స్పందించాడు. "వై సర్‌? ఎందుకు? ఇప్పటికే ఈ వర్షం, ట్రాఫిక్‌తో సతమతమవుతున్నా. రొమాన్స్‌కి మ్యారేజ్ అక్కర్లేదు. రిలేషన్‌షిప్‌ చాలు" అన్నాడు. మరో అభిమాని "బహుశా మీరు గత జన్మలో గృహిణిగా పుట్టి, మీ భర్తకు ఇంట్లో బజ్జీలు, పకోడీలు చేసి పెట్టారేమో?" అని సమాధానం ఇవ్వగా, "హహహ..." అని ఓ నవ్వు నవ్వి, "అయ్యుండొచ్చు... ఈ జన్మలో సైతం నా గర్ల్‌ ఫ్రెండ్‌ సంపాదిస్తుంటే జీవిస్తూ, తనకు వండిపెట్టడానికి అభ్యంతరం లేదు. హోమ్‌ మేకర్‌ గా ఉండటం అంత ఈజీ పని కాదు" అని సమాధానం ఇచ్చాడు.

  • Loading...

More Telugu News