: ప్రభాస్ కోసం కరణ్ జొహార్ స్పెషల్ పార్టీ.. తరలివచ్చిన బాలీవుడ్ తారలు!
బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జొహార్ నిన్న రాత్రి ముంబైలోని తన నివాసంలో అదిరిపోయే పార్టీ ఇచ్చాడు. కేవలం ప్రభాస్ కోసమే ఈ పార్టీని కరణ్ ఏర్పాటు చేశాడని సమాచారం. ఈ పార్టీకి ప్రభాస్ తో పాటు రానా కూడా హాజరయ్యాడు. బాలీవుడ్ యువ తారాగణం ఈ విందుకు తరలి వచ్చింది. పార్టీకి హాజరైన బాలీవుడ్ స్టార్లలో అలియా భట్, వరుణ్ ధావన్, రణబీర్ కపూర్, అర్జున్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా తదితరులు విచ్చేశారు. 'బాహుబలి' సినిమాను హిందీలో కరణ్ జొహార్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో, కరణ్ పార్టీ ఇచ్చాడు. కొద్ది రోజులుగా యూఎస్ లో ఉన్న ప్రభాస్... తిరిగి వచ్చిన నేపథ్యంలో కరణ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాడు. 'బాహుబలి' సినిమాతో ఘన విజయం సాధించిన ప్రభాస్ ను ఈ సందర్భంగా బాలీవుడ్ తారలు అభినందించారు. నెక్స్ట్ మూవీ 'సాహో' కోసం తాము ఎదురుచూస్తున్నామని చెప్పారు.