: హైదరాబాద్ లో అత్యంత విచిత్రమైన కిడ్నాప్!


సాధారణంగా డబ్బు కోసం కిడ్నాప్ చేస్తుంటారు. ఆస్తి తగాదాల నేపథ్యంలో కూడా కిడ్నాపులు జరుగుతుంటాయి. కక్షలు, వివాదాల కారణంగా కూడా కిడ్నాపులు చేస్తుంటారు. కానీ, హైదరాబాదులోని ఎల్బీ నగర్ లో జరిగిన ఓ కిడ్నాప్ మాత్రం వీటన్నింటికీ విరుద్ధం. నలుగురు భిక్షగాళ్లను గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ఈ తెల్లవారుజామున ఎల్బీ నగర్ లోని హనుమాన్ టెంపుల్ వద్ద నిద్రిస్తున్న వీళ్లను... వ్యానులో వచ్చిన దుండగులు అపహరించారు. జరిగిన ఘటనపై తోటి బిచ్చగాళ్లు ఎల్బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తును ప్రారంభించారు.

  • Loading...

More Telugu News