: ఆరెస్సెస్ వ్యక్తిని ఎంపిక చేశారు... రాష్ట్రపతి ఎన్నికలో పోటీ తప్పదు: సీపీఐ
ఎన్డీయే తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్ నాథ్ ను బీజేపీ ప్రకటించడం పట్ల సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి నిరాశను వ్యక్తం చేశారు. రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో బీజేపీ నేతలు తమతో చర్చ జరిపినప్పుడు... ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన వ్యక్తిని ఎంపిక చేయరాదని తాము చాలా స్పష్టంగా చెప్పామని, అయినప్పటికీ ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వ్యక్తినే రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశారని అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ తప్పదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంపై విపక్ష పార్టీల నేతలంతా కలసి చర్చించి, విపక్షాల తరపున ఓ అభ్యర్థిని నిర్ణయిస్తామని తెలిపారు.