: అమెజాన్‌లో మరోసారి బంపర్ ఆఫర్లు


ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ మ‌రోసారి బంప‌ర్ ఆఫ‌ర్ల‌తో త‌మ వినియోగ‌దారుల ముందుకు వ‌చ్చింది. స్మార్ట్‌ఫోన్లతో పాటు ప‌లు ఎలక్ట్రానిక్ పరిక‌రాల‌పై అద్భుత ఆఫ‌ర్లు ప్ర‌క‌టించింది. ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు ప‌లు బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌, హెడ్‌ఫోన్ లాంటి వాటిపై డిస్కౌంట్లు ఇచ్చింది. ఐఫోన్ 7, వన్‌ప్లస్‌ 3 టీ , జీ5  ప్లస్, ఐఫోన్‌ ఎస్‌ఈతో పాటు యాపిల్, హెచ్‌పీ, లెనోవా, డెల్ తదితర బ్రాండ్ల ల్యాప్‌ ట్యాప్‌ ధరలను కూడా త‌గ్గించింది. టీవీ, ఫ్రిజ్‌ వంటివాటిపై కూడా డిస్కౌంట్లు అందిస్తోంది. ఈ ఆఫ‌ర్ల ప్ర‌కారం.. ఐఫోన్ 7.. 32జీబీను రూ. 42,999కే అందిస్తోంది. అలాగే ఐఫోన్ 7 128జీబీ,  256జీబీ ఫోన్లు  రూ. 54,490, రూ.  65,900 లకే పొంద‌వ‌చ్చు. అంతేగాక‌, రూ.13,060 పాత స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ కింద‌ ఐఫోన్ 6 32జీబీను  రూ. 24,999కే సొంతం చేసుకోవ‌చ్చు. వన్‌ ప్లస్‌ 3టీపై డిస్కౌంట్ ఆఫ‌ర్ తోపాటు వొడాఫోన్ సిమ్ కార్డు ద్వారా 45 జీబీ డేటాను అందిస్తోంది.

 మరిన్ని డిస్కౌంట్ల వివరాలు:  
  • మోటో జెడ్‌- రూ.29 వేలకే పొంద‌వ‌చ్చు, రూ. 13వేల తగ్గింపు ధ‌ర‌తో ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ కూడా ఉంది 
  • శాంసంగ్‌ గెలాక్సీ 7 ప్రో- రూ.8690కే పొంద‌వ‌చ్చు, రూ. 6,712 దాకా ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ కూడా ఉంది
  •  కూల్‌ ప్యాడ్‌- రూ. 2వేలు డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు

 మ‌రిన్ని వివ‌రాల‌ను అమెజాన్ వెబ్‌సైట్‌లో చూడ‌వ‌చ్చు.  

  • Loading...

More Telugu News