: ఒక్క గజం భూమి, ఒక్క పైసా పోలేదని సీఎం కేసీఆర్ ఎలా నిర్ధారణకు వచ్చారు: నాగం జనార్దన్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఈ రోజు హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... భూముల వ్యవహారంలో సంబంధం ఉన్న గోల్డ్‌స్టోన్ ప్రసాద్‌ను ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు. ఒక్క గజం భూమి, ఒక్క పైసా పోలేదని సీఎం ఎలా నిర్ధారణకు వచ్చారని, ఈ కేసులో సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించలేదని ఆయన అడిగారు. ఇంత పెద్ద అక్రమ వ్యవహారంలో కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. అలాగే, మతపర రిజర్వేషన్ల అంశంపై సీఎం కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు చెప్పుకుంటున్నారనీ ఆయన విమర్శించారు. తమ పార్టీ మతపర రిజర్వేషన్లకు వ్యతిరేకం అని అన్నారు. అయినప్పటికీ ఈ రిజర్వేషన్లకు ప్రధాని మోదీ ఒప్పుకున్నారని అంటూనే.. మరోవైపు ఒప్పుకోకపోతే పోరాటం చేస్తామని కేసీఆర్ మరో మాట మట్లాడుతున్నారని నాగం మండిపడ్డారు.