: పాకిస్థాన్ కు సైన్యాన్ని పంపించండి.. ఉగ్రవాదం అంతు చూడండి.. చైనాలో పెరుగుతున్న డిమాండ్
పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ లో ఇద్దరు చైనా జాతీయులను ఐసిస్ ఉగ్రవాదులు హత్య చేయడం పట్ల చైనీయుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే పాకిస్థాన్ కు చైనా బలగాలను పంపాలంటూ చైనా వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. ఉగ్రవాదులను ఉక్కుపాదంతో అణచివేయడానికి సైనిక బలగాలను పంపాల్సిందేనని చైనా ప్రజలు కోరుతున్నారు.
చైనీయులను చంపిన ఉగ్రవాదులకు గుణపాఠం నేర్పాల్సిందేని సోషల్ మీడియాలో చైనా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఐసిస్ కు వ్యతిరేకంగా చైనా యుద్ధాన్ని మొదలు పెట్టాల్సిందేనని కోరుతున్నారు. హత్యకు గురైన చైనీయులు ఇద్దరూ చట్ట విరుద్ధంగా మత బోధనలు చేస్తున్నారంటూ పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించడంతో... చైనీయుల్లో ఆగ్రహం మరింత పెరిగింది.