: శంషాబాద్ లో కుండపోత వర్షం... విమానాలు ఆలస్యం
హైదరాబాదులోని శంషాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. కుండపోతగా కురుస్తున్న వర్షం ధాటికి శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వాతావరణం అనుకూలించక విమానాల ల్యాండింగ్ వీలు కావడం లేదు. దీంతో విశాఖపట్టణం, తిరుపతి, రాజమండ్రి, గన్నవరం నుంచి విమానాలు రావడం ఆలస్యమవుతుందని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు.