: విశాఖ భూ కుంభకోణం... రేపటి నుంచే సిట్ దర్యాప్తు: డీజీపీ సాంబశివరావు


విశాఖ భూ కుంభకోణం వ్యవహారంలో సిట్ దర్యాప్తు రేపటి నుంచి ప్రారంభిస్తుందని ఏపీ డీజీపీ సాంబశివరావు స్పష్టం చేశారు.
విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ విషయమై సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు సిట్ ను ఏర్పాటు చేశామని, గతంలో సీబీఐ డీజీగా పని చేసిన వినీత్ బ్రిజ్ వాల్ ఈ బృందానికి నేతృత్వం వహిస్తారని అన్నారు. ఈ భూముల కుంభకోణం వ్యవహారంలో నేరస్థులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలమని, ఇప్పటికే ముగ్గురిపై కేసులు నమోదు చేశామని చెప్పారు. ఈ వ్యవహారానికి సంబంధించి వచ్చిన ప్రతి ఆరోపణపైనా సిట్ లోతైన దర్యాప్తు చేస్తుందని చెప్పారు. భూ రికార్డుల ట్యాంపరింగ్ కు పాల్పడిన వారు ఎంతటి వారైనా సరే, వదిలిపెట్టమని, రెవెన్యూకు సంబంధించి ఆర్వోఆర్ 1బీ లోని 25 రికార్డుల్లో ట్యాంపరింగ్ జరిగినట్టు గుర్తించామని అన్నారు.

  • Loading...

More Telugu News