: దేశ వ్యాప్తంగా ప్రశాంతంగా జరుగుతున్న సివిల్స్ పరీక్ష
దేశ వ్యాప్తంగా ఈ రోజు నిర్వహిస్తున్న యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా సాగుతోంది. ఈ పరీక్షకు దేశ వ్యాప్తంగా ఈ ఏడాది 9 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి అరవై వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఈ రోజు ఉదయం 9.30 నుంచి 11.30 వరకు తొలి పరీక్ష జరిగింది. మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 వరకు సీ-శాట్ రెండో పరీక్ష జరుగుతోంది. విజయవాడ కేంద్రంగా పదకొండు వేల మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాస్తున్నారు. సివిల్స్ ప్రాథమిక పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారి నుంచి ఒక్క పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేస్తారు. మెయిన్స్ పరీక్ష ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో నిర్వహించనున్నారు.