: ఫైనల్ పవర్ ఏంటో తెలుసా?... కేవలం లండన్ లోనే 2 వేల కోట్ల బెట్టింగ్ లు...మరి భారత్ లో?


ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో రసవత్తర పోరుకి సర్వసిద్ధమైంది. మరో రెండు గంటల్లో ప్రారంభం కానున్న ఈ పోటీపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి వ్యక్తం అవుతోంది. దాయాదుల మధ్య పోరుకి మీడియా ఎనలేని ప్రాచుర్యం కల్పించింది. ఈ నేపథ్యంలో బెట్టింగ్ లు ఊపందుకున్నాయి. దాయాదుల మధ్య పోరులో భారత్ దే గెలుపని గణాంకాలు చెబుతుండడంతో బెట్టింగ్ లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. భారత్ గెలుపుపై వెయ్యి రూపాయలు బెట్ కాస్తే అంతే గెలుచుకునే అవకాశం వుంది. అదే పాకిస్థాన్ పై బెట్ కాసి, ఆ జట్టు విజయం సాధిస్తే మాత్రం వెయ్యి రూపాయల పెట్టుబడికి మూడు వేలు అందుకునే అవకాశం ఉంది. దీంతో భారత్ గెలవాలని భారతీయులు ఆశిస్తున్నప్పటికీ... పాక్ ను నమ్ముకున్న బెట్టింగ్ రాయుళ్లు మాత్రం పాక్ గెలవాలని కోరుకుంటున్నారు.

 ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ పై కేవలం లండన్ లోనే 2,000 కోట్ల రూపాయల బెట్టింగ్ జరిగిందని సమాచారం. ఇంగ్లండ్ లో బెట్టింగ్ చట్టబద్ధం. దీంతో అక్కడ ట్యాక్సులు చెల్లించే బెట్టింగ్ జరుగుతుంది. ఇక ఇతర దేశాల్లో బెట్టింగ్ 1,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇక భారత్ విషయానికి వస్తే కనుక, దీనికి లెక్క లేదని చెబుతున్నారు. బెట్టింగ్ ఊపందుకుందని, వాట్స్ యాప్ లో గ్రూపులు కట్టి మరీ కోట్లలో బెట్టింగులు జరుగుతున్నాయని తెలుస్తోంది. బుకీలు పది నుంచి 50 శాతం వడ్డీతో అప్పులు ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు బ్లాంక్ చెక్కులు, ఆస్తుల ప్రాంసరీ నోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరికీ అనుమానం రాకుండా కిరాణా, పాన్ షాపుల అడ్డగా వ్యాపారం జరుగుతున్నట్టు తెలుస్తోంది. డెలివరీ బాయ్ లు డబ్బులు ఇంటికి తీసుకెళ్లిమరీ ఇస్తుండడం విశేషం.

  • Loading...

More Telugu News