: బెంగళూరులో దారుణం... కట్టుకున్న భర్తే స్నేహితులతో కలిసి రేప్ చేశాడు!


బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. నగరంలోని భారతీనగర్ ఠాణా పరిధిలోని శివాజీ నగర్ ప్రాంతంలోని బంబూ బజార్ ప్రాంతంలో ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. వారిద్దరి మధ్య పలు విభేదాలున్నాయి. అయితే రంజాన్ సందర్భంగా కఠిన ఉపవాసమాచరిస్తున్న ఆమె (35) ను భర్త ఈ నెల 11న స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. బయటకు వెళదామని చెప్పి, భార్యను ఓ నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లాడు. అయితే అప్పటికే అక్కడ అతని స్నేహితులు ముగ్గురు ఉన్నారని, వారంతా కలిసి తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె తెలిపింది.

 తీవ్ర అస్వస్థతకు గురైన బాధితురాలిని ఇరుగుపొరుగు వారు బౌరింగ్‌ ఆసుపత్రిలో చేర్పించారు. రంజాన్‌ మాసం సందర్భంగా ఆమె ఉపవాసం ఉంటోంది. అయినా కిరాతకుడైన భర్త కలహాల నేపథ్యంలో ఈ ఘోరానికి పాల్పడ్డాడు. జరిగిన దారుణాన్ని తనలోనే దాచుకుని కుమిలిపోతున్న ఆమెకు తల్లిదండ్రులు, బంధువులు ధైర్యం చెప్పడంతో పోలీసులకు మౌఖిక ఫిర్యాదు చేసింది. రంజాన్ ముగిసిన అనంతరం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తానని తెలిపింది. వైద్య నివేదిక అనంతరం మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. కాగా, ఇప్పటికే ఈ ఘటనపై సదరు నిందితులు కేసు నుంచి తప్పించుకునేందుకు పైరవీలు మొదలుపెట్టినట్టు కన్నడ మీడియా చెబుతోంది.

  • Loading...

More Telugu News