: ట్రంప్ మరో సంచలన నిర్ణయం...క్యూబాతో కటీఫ్?


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో క్యూబాతో మైత్రిని పెంపొందించుకుంటూ... 2014 డిసెంబర్ లో క్యూబాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య మైత్రీ బంధం బలపడిందన్న సందేశాల నడుమ క్యూబా అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రోతో కలిసి ఒబామా ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందాన్ని ట్రంప్ రద్దు చేశారు. ఒబామా క్యూబాతో చేసుకున్న ఒప్పందం ఏకపక్షంగా ఉందని ఆయన ఈ సందర్భంగా ఆరోపించారు.

రౌల్‌  క్యాస్ట్రో సైనిక ఆధిపత్యానికి బలం చేకూర్చడానికి అమెరికా డాలర్లను సాయంగా అందించమని ఆయన స్పష్టం చేశారు. ఆ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నానని ప్రకటించిన ట్రంప్, తక్షణం ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని తెలిపారు. దీనికి బదులుగా కొత్త విధానం తీసుకొస్తున్నామని తెలిపారు. అమెరికా చట్టాలకు లోబడే కొత్త విధానంతో రెండు దేశాల ప్రజలకు ప్రయోజనం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. పెట్టుబడులు నేరుగా క్యూబా ప్రజలకు చేరేలా అమెరికా చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. దీని వల్ల వారు సొంత వ్యాపారాలు ప్రారంభించి, దేశాభివృద్ధికి తోడ్పడతారని తెలిపారు. అంతే కాకుండా క్యూబా ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. క్యూబా ప్రభుత్వం హైజాకర్లు, ఉగ్రవాదులు, పోలీసులను హత్యలు చేసిన వారిని కాపాడిందని ట్రంప్ ఆరోపించారు. దీనిపై క్యూబా ప్రభుత్వం మండిపడింది.

  • Loading...

More Telugu News