: మహ్మద్ అమీర్ ఫిట్... రేపటి మ్యాచ్ లో ఆడనున్న పాక్ కీలక బౌలర్!


ఛాంపియన్స్‌ ట్రోఫీలో రేపు భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. గాయంతో రేపటి మ్యాచ్ కు భార‌త బౌల‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ దూర‌మైతే, మరోవైపు ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌కు దూరమైన పాకిస్థాన్‌ బౌలర్ మహ్మద్ అమీర్ ఫైనల్ మ్యాచ్‌‌లో ఆడ‌నున్నాడు. తాజాగా పాకిస్థాన్‌ బౌలింగ్ కోచ్ అజర్ మహ్మద్ మీడియాతో మాట్లాడుతూ... తమ బౌల‌ర్‌ అమీర్ ఫిట్‌గా ఉన్నాడని చెప్పాడు. నెట్ ప్రాక్టీస్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నాడ‌ని అన్నాడు. రేప‌టి మ్యాచ్‌లో ఆయ‌న‌ను వినియోగించుకోవాలని పాక్ జట్టు యోచిస్తోంది. పాక్ జట్టుకి బౌలింగే బలం.. అమీర్ కూడా రేపు జట్టులో ఆడుతుండడంతో పాకిస్థాన్ జట్టు మరింత బలంగా కనపడుతోంది.     

  • Loading...

More Telugu News