: ఇప్పటివరకు ఇలాంటి పాత్రలో నటించలేదంటూ.. గోదావరి ఒడ్డున దిగిన ఓ ఫోటోను పోస్ట్ చేసిన సమంత!


మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ్, చెన్నై బ్యూటీ స‌మంత‌, ద‌ర్శ‌కుడు సుకుమార్ ల కాంబినేష‌న్‌లో రూపొందుతున్న 'రంగస్థలం' సినిమా తాజా షెడ్యూలు షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి చుట్టుపక్కల జరుగుతోంది. ఈ షూటింగులో చరణ్ తో పాటు స‌మంత కూడా పాల్గొంటోంది. ఈ 'రంగ‌స్థ‌లం' సినిమాలో స‌మంత‌ ఓ పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటిస్తోంది. ఈ నేప‌థ్యంలో త‌న ఇన్‌స్టాగ్రాంలో ఓ ఫొటోను పోస్ట్ చేసిన స‌మంత.. తాను ఇప్పటివరకు ఇలాంటి పాత్రలో నటించలేదని తెలిపింది. 'వాస్తవికత ఎప్పుడూ అందంగా ఉంటుంది' అంటూ క్యాప్ష‌న్ ఇస్తూ తాను గోదావరి ఒడ్డున దిగిన ఓ ఫోటో షేర్ చేసింది. ఈ ఫొటోలలో సమంత పాదాలు మాత్ర‌మే క‌న‌ప‌డుతున్నాయి.

  • Loading...

More Telugu News