: మొసలితో చెలగాటం: నోట్లో తల పెట్టాడు... కొరికేసింది!


థాయ్‌లాండ్‌లోని కోహ్‌ సముయ్‌ ప్రాంతంలో ఓ వ్య‌క్తి మొస‌లి నోట్లో త‌ల‌పెట్టి ప్ర‌మాదం నుంచి తృటిలో త‌ప్పించుకున్నాడు. ఆ ప్రాంతంలోని ఓ జూలో మొసలితో వినూత్న విన్యాసాలు చేయిస్తున్నారు. ఇందులో భాగంగా జూ సిబ్బంది ఒకరు మొసలితో స్టంట్ చేస్తున్నాడు. మొసలి నోటిని తెరిచేలా చేసి మెల్లిగా అందులో తన తల పెట్టాడు. కొన్ని క్ష‌ణాల్లోనే మొసలి ఆ వ్యక్తి తలను ఒక్క‌సారిగా ప‌ట్టేసింది. కాసేపాగాక అత‌డి త‌ల‌ను వ‌దిలేసి నీళ్లలోకి వెళ్లిపోయింది. మ‌రికాసేపు అది అలాగే అత‌డి త‌ల‌ను గ‌ట్టిగా నొక్కి ప‌ట్టుంటే కనుక అత‌డి ప్రాణాలు గాల్లో క‌లిసిపోయేవి. ఓ పర్యాటకుడు ఈ దృశ్యాల‌ను త‌న సెల్‌ఫోన్‌లో బంధించి యూట్యూబ్‌లో పోస్టు చేశాడు. ఎంతో మంది ఆస‌క్తిగా చూస్తున్న ఈ వీడియోను మీరూ చూడండి.

  • Loading...

More Telugu News