: థ్యాంక్స్ సుమంత్ అన్న: ద‌గ్గుబాటి రానా


తెలుగు టీవీ షోలో యాంక‌ర్‌గా త్వ‌ర‌లోనే న‌టుడు రానా ఎంట్రీ ఇవ్వ‌బోతున్న విష‌యం తెలిసిందే. జెమిని టీవీలో త్వ‌ర‌లోనే ‘నెంబ‌ర్ వ‌న్ యారీ విత్ రానా’ అనే ప్రోగ్రాం ప్రారంభం కానుంది. ఆ షోలో మొద‌టి ఎపిసోడ్‌లో అతిథులుగా న‌టులు అక్కినేని నాగ‌చైత‌న్య‌, సుమంత్‌లు క‌నిపించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ‘నెం.1 యారీ విత్ రానా’ ప్రోగ్రాం సెట్‌లో వారు ఇద్ద‌రు క‌లిసి రానాతో దిగిన ఓ సెల్ఫీని సుమంత్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. యాంక‌ర్‌గా రానాలోని కొత్తకోణం కూడా అద్భుతంగా ఉంద‌ని ఈ సంద‌ర్భంగా సుమంత్ అన్నాడు. ఆయ‌న ట్వీట్‌పై స్పందించిన రానా థ్యాంక్స్ సుమంత్ అన్న అని పేర్కొన్నాడు. 

  • Loading...

More Telugu News