: చంచల్ గూడ జైలుకు శిరీష కేసు నిందితులు!


సంచలనం రేపిన బ్యూటీషియన్ శిరీష కేసులో నిందితులైన రాజీవ్, శ్రవణ్ లకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో, వీరిని హైదరాబాదులోని చంచల్ గూడ జైలుకు పోలీసులు తరలించారు. ఈ రోజు వీరిద్దరినీ నాంపల్లి కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టారు. అంతకు ముందు ఉస్మానియా ఆసుపత్రిలో వీరికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కేసులో ఏ1 ముద్దాయిగా శ్రవణ్ ను, ఏ2గా రాజీవ్ ను పోలీసులు పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News