: అమెరికా యుద్ధ నౌకను ఢీ కొట్టిన కార్గో నౌక... పలువురికి గాయాలు!
ఉత్తరకొరియాతో నెలకొన్న వైరం నేపథ్యంలో జపాన్ సముద్ర జలాల్లో అమెరికా నావికాదళానికి చెందిన యుద్ధనౌకలు గస్తీ కాస్తున్నాయి. ఈ క్రమంలో జపాన్ లోని యోకుసుఖాకు 56 నాటికల్ మైళ్ల దూరంలో వేకువ జాము 3 గంటల సమయంలో ఫిలిప్పీన్స్ జెండా కలిగిన ఏసీఎక్స్ క్రిస్టల్ అనే కార్గో (సరకు రవాణా) నౌక ఒకటి అమెరికా నావికాదళానికి చెందిన పిట్జరాల్డ్ అనే క్షిపణి విధ్వంసక యుద్ధ నౌకను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు నౌకల్లోని సిబ్బంది గాయపడ్డారని సమాచారం. యుద్ధనౌకకు చిల్లుపడి నీరు లోపలికి వస్తోందని, దానిని నేవీ సిబ్బంది నియంత్రించినట్టు తెలుస్తోంది. కార్గో నౌక నేవి షిప్ ను ఢీ కొట్టిన సమయంలో అందులో 330 మంది సిబ్బంది ఉన్నారని తెలుస్తోంది.