: కేంద్ర ప్ర‌భుత్వ కొత్త నిబంధ‌న‌పై మ‌మ‌తా బెన‌ర్జీ ఆగ్ర‌హం


కేంద్ర ప్ర‌భుత్వ కొత్త నిబంధ‌న‌పై ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కొత్త‌గా బ్యాంకు అకౌంట్‌ తెరవడానికి, రూ.50 వేలకు పైన‌ ఆర్థిక లావాదేవీలకు ఆధార్ కార్డు త‌ప్ప‌నిస‌రి అని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ప్రస్తుతమున్న బ్యాంకు అకౌంట్ ఖాతాదారులు కూడా ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ఆధార్ ను బ్యాంకుల్లో సమర్పించాలని స‌ర్కారు ఆదేశించింది. దీనిపై స్పందించిన‌ మమతా బెనర్జీ కేంద్ర ప్ర‌భుత్వం పెట్టిన ఈ కొత్త నిబంధ‌న‌తో ప్రజల వ్యక్తిగత సమాచారం గోప్యతకు సంబంధించి తీవ్రమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని అన్నారు. ఈ నిబంధ‌న ద్వారా ఇబ్బందిపడేది నిరుపేద, అట్టడుగు వర్గాలవారేన‌ని అన్నారు. దేశంలో ఎంతో మంది ప్ర‌జ‌ల‌కు ఆధార్ అందుబాటులో లేనిదే ఈ నిర్ణ‌యాన్ని ఎలా తీసుకున్నార‌ని ఆమె నిల‌దీశారు.

  • Loading...

More Telugu News