: తనను ఎందుకు ప్రేమించడం లేదని... యువతిని చితక్కొట్టిన యువకుడు!
ప్రేమ పేరుతో నేటి యువత రెచ్చిపోతోంది. తమని బలవంతంగా ప్రేమించమంటూ అమ్మాయిల వెంటపడుతున్నారు. తమ మాట వినకపోతే వారిపై దాడులు కూడా చేస్తున్నారు. ఇటువంటి ఘటనే మరొకటి ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. కొంత కాలంగా ఓ అమ్మాయి వెంటపడుతున్న ఓ యువకుడు తాజాగా ఆమె ముందు నిలబడి తనను ఎందుకు ప్రేమించడం లేదని అడిగాడు. ఆ యువతి తనను వదిలేయాలని వేడుకుంది.
దీంతో నన్ను ప్రేమిస్తావా? లేదా? అంటూ ఆ యువకుడు ఆమెపై దాడి చేశాడు. ఓ జిమ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ యువతిని ఆమె స్నేహితురాలు ఆ యువకుడి బారి నుంచి విడిపించి జిమ్ లోపలికి తీసుకెళ్లింది. అయినప్పటికీ ఆ యువకుడు జిమ్‌లోంచి ఆ అమ్మాయిని బయటకు లాక్కొచ్చి కొట్టాడు. ఈ ఘటన అక్కడి సీసీ కెమెరాలో రికార్డయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.