: తేజస్వినిపై ఎలాంటి కేసు ఉండదు: సీపీ మహేందర్ రెడ్డి


బ్యూటీషియన్ హత్య కేసులో నిందితురాలైన సాఫ్ట్ వేర్ ఇంజినీర్, రాజీవ్ ప్రియురాలు తేజస్వినిపై ఎలాంటి కేసు ఉండదని హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. ఫేస్ బుక్ ద్వారా తేజస్వినితో దాదాపు మూడేళ్లుగా రాజీవ్ కు పరిచయం ఉందని ఆయన తెలిపారు. అప్పట్లో ఆమె బెంగళూరులో పని చేసేదని.. ఏడాది క్రితం ఆమె హైదరాబాద్ వచ్చినప్పుడు ఇద్దరూ శారీరకంగా కలుసుకున్నారని... ఆ తర్వాత వారి సంబంధం కొనసాగిందని... ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారని చెప్పారు. అయితే, శిరీషతో అప్పటికే రాజీవ్ కు శారీకసంబంధం ఉందనే వియషం ఆమెకు తెలియదని, హైదరాబాద్ కు వచ్చాకే తెలిసిందని... తెలిసిన తర్వాత సమస్యలు ప్రారంభమయ్యాయని తెలిపారు. సమస్యను పరిష్కరించుకునేందుకు ఆమె ప్రయత్నం చేసిందే తప్ప... శిరీష మరణంతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని, అందువల్ల ఆమెపై ఎలాంటి కేసు ఉండదని స్పష్టం చేశారు. 

  • Loading...

More Telugu News