: శిరీష, రాజీవ్ ల మధ్య ఎంటరైన తేజస్విని.. రాజీవ్ తో ఆమెకు కూడా శారీరక సంబంధం ఉంది!: సీపీ మహేందర్ రెడ్డి


శిరీష మరణానికి సంబంధించి మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ కమిషనర్ మహేందర్ రెడ్డి పలు విషయాలను వెల్లడించారు. శిరీష, రాజీవ్ లకు మధ్య శారీరక సంబంధం కొనసాగుతున్న సమయంలో... బెంగళూరులో హెచ్ ఆర్ మేనేజర్ గా ఉన్న తేజస్వినితో రాజీవ్ కు ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయిందని.. ఏడాది కింద బెంగళూరు నుంచి తేజస్విని హైదరాబాదుకు వచ్చిందని... ఈ నేపథ్యంలో రాజీవ్, తేజస్వినిల మధ్య శారీరక సంబంధం ఏర్పడిందని, వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారని చెప్పారు.

ఈ క్రమంలో గత మూడు నెలల నుంచి రాజీవ్ తనను నెగ్లెక్ట్ చేస్తున్నాడనే అనుమానం తేజస్వినిలో ఏర్పడింది. దీంతో, ఒక రోజు రాజీవ్ స్టూడియోకు తేజస్విని వెళ్లగా... ఇప్పుడే రాజీవ్ ఆయన భార్యతో కలసి బయటకు వెళ్లారని ఆఫీస్ బాయ్స్ ఆమెతో చెప్పారు. దీంతో, 'ఇదేంటి తామిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం కదా... మధ్యలో ఈ భార్య ఎవరు?' అని ఆమె షాక్ కు గురైంది. ఈ తర్వాత ఆమె పలుమార్లు అక్కడకు వెళ్లడంతో శిరీష, రాజీవ్ ల సంబంధం ఆమెకు అర్థమయింది. ఆ తర్వాత వాళ్లతో తేజస్విని గొడవ పడింది.

  • Loading...

More Telugu News