: పార్టీని విమర్శించేవారు ఎంతటి వారైనా సరే.. వేటు తప్పదు: కళా వెంకట్రావు


సొంత పార్టీపైన, ప్రభుత్వ వ్యవహారాలపైన మంత్రులు సహా టీడీపీ నేతలు ఎవరైనా బహిరంగంగా విమర్శలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఏపీటీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ నుంచి అలాంటి వారిని సస్పెండ్ చేస్తామని... ఆ తర్వాత విచారణ చేపట్టి, చర్యలు తీసుకుంటామని చెప్పారు. భూ వివాదంతో జైల్లో ఉన్న ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని ఇప్పటికే పార్టీ నుంచి సస్పెండ్ చేశామని తెలిపారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడుల బహిరంగ విమర్శలపై ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని వేస్తున్నామని చెప్పారు. నేతల మధ్య ఉన్న విభేదాలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పార్టీ నిబంధనలను ఉల్లంఘించేవారు ఎంతటివారైనా సరే చర్యలు తప్పవని చెప్పారు.

  • Loading...

More Telugu News