: అక్రమాస్తుల కేసులో విచారణకు హాజరైన పాక్ ప్ర‌ధాని ష‌రీఫ్


పాకిస్థాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కి విదేశాల్లో అక్ర‌మాస్తులు ఉన్నాయ‌ని పనామా పత్రాల లీకేజీ ద్వారా బ‌య‌ట‌ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో ఆయ‌న ఈ రోజు విచార‌ణ‌కు హాజరయ్యారు. ఇస్లామాబాద్‌లోని సంయుక్త దర్యాప్తు బృందం (జిట్‌) అధికారులు ఆయనను ప్ర‌శ్నించారు. అనంత‌రం న‌జాజ్ ష‌రీఫ్ మీడియాతో మాట్లాడుతూ తనపై వచ్చిన ఆరోపణలు అన్నీ అవాస్త‌వాలేన‌ని అన్నారు. త‌న‌పై వ‌స్తోన్న ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో విచారణ బృందానికి ప‌లు పత్రాలను సమర్పించినట్టు తెలిపారు. తనను అక్ర‌మాస్తుల‌ కేసుల్లో ఇరికించేందుకు త‌న‌ రాజకీయ ప్రత్యర్థులు కుట్ర‌లు చేశార‌ని అన్నారు. చివ‌రికి వారు చేసిన ఆరోపణలను నిరూపించలేకపోయారని చెప్పారు. 

  • Loading...

More Telugu News