: హైదరాబాదులో పలు చోట్ల వర్షం
హైదరాబాదులో పలు చోట్ల ఈ మధ్యాహ్నం వర్షం కురిసింది. ఎల్బీనగర్, వనస్థలిపురం, దిల్ సుఖ్ నగర్, హయత్ నగర్, సైదాబాద్, చంచల్ గూడ, మలక్ పేట, ఆజంపురా, సికింద్రాబాద్, బోడుప్పల్, మేడిపల్లి, ఘట్ కేసర్, మేడ్చల్, కుషాయిగూడ, చర్లపల్లి, ఈసీఐఎల్, నేరేడ్ మెట్, ఎర్రగడ్డ తదితర ప్రాంతాలు వర్షం వల్ల జలమయం అయ్యాయి. దీంతో, ఈ ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. వర్షం కారణంగా పాదచారులకు చాలా ఇబ్బంది కలిగింది. రోడ్లపై నిలిచిన వర్షపు నీటితో వాహనదారులు సమస్యలు ఎదుర్కొన్నారు. కరెంట్ కూడా పోవడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.