: చంద్రబాబు దళిత జాతిని అవమానపరిచారు: భూమన కరుణాకర్ రెడ్డి


ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో కుల వివక్ష చాలా పెరిగిపోయిందని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బాబు సొంత జిల్లా చిత్తూరులో కూడా ఈ వివక్ష అధికంగా ఉందని చెప్పారు. కుల వివక్ష వల్ల దళితులు, బలహీన వర్గాల ప్రజలపై దాడులు ఎక్కువవుతున్నాయని అన్నారు. సాక్షాత్తు చంద్రబాబే దళితులను అవమానిస్తూ మాట్లాడితే ఎలాగని ప్రశ్నించారు.

పెరిగే ఛార్జీలకు అనుగుణంగా దళిత, బలహీన వర్గాల విద్యార్థులకు మెస్ ఛార్జీలను పెంచుతామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారని... ఇంతవరకు ఆ హామీని అమలు చేయలేదని భూమన మండిపడ్డారు. 31 లక్షల ఎకరాల భూమిని దళితులు, బలహీన వర్గాలకు వైఎస్సార్ పంపిణీ చేశారని.. చంద్రబాబు మాత్రం భూసేకరణ పేరుతో 10 లక్షల ఎకరాల దళితుల భూమిని లాక్కున్నారని విమర్శించారు. ఈ మూడేళ్ల పాలనలో దళితుల కోసం చంద్రబాబు ఒక్క ఇంటిని కూడా నిర్మించలేదని అన్నారు.

  • Loading...

More Telugu News