: కోదండరాం గారూ.. మీరు ఏం మాట్లాడుతున్నారో నాకైతే ఆర్థం కావట్లేదు.. మీకు కాంగ్రెస్ గాలి తగిలింది: హరీశ్‌రావు
తెలంగాణ ప్రభుత్వంపై టీజేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరాం చేస్తోన్న విమర్శలపై మంత్రి హరీశ్‌రావు స్పందించారు. ‘కోదండరాం గారూ.. మీరు ఏం మాట్లాడుతున్నారో నాకైతే ఆర్థం కావట్లేదు.. 40 లక్షల మంది పేదలకు పింఛన్‌లు ఇస్తున్నాం. మిషన్ కాకతీయ కింద చెరువులన్నీ బాగుచేస్తుంటే మీకు తప్పుగా కనపడుతోందా? కేసీఆర్ ప్రభుత్వ ఆసుపత్రులు బాగు చేస్తే మీకు తప్పుగా కనపడుతోందా? షాదీ ముబారక్ వంటి ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం తప్పా? కోటి ఎకరాలకు నీళ్లు అందించడమే లక్ష్యంగా ముందుకు వెళుతోంటే అది తప్పుగా కనపడుతోందా? కోదండరాంకు కాంగ్రెస్ పార్టీగాలి తగిలింది.. అందుకే ఇలా మాట్లాడుతున్నారు’ అని హరీశ్ రావు అన్నారు.
‘తెలంగాణ ఉద్యమంలో మీరూ ఉన్నారు.. అప్పట్లో కులవృత్తులను బాగు పర్చాలని అనుకోలేదా?.. కుల వృత్తులను కేసీఆర్ సర్కారు బలోపేతం చేస్తోంది. గొల్లకురుమల అభివృద్ధికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నాం. తెలంగాణలో 500 ఇంగ్లిష్ మీడియం రెసిడెన్షియల్ స్కూళ్లను నెలకొల్పాం’ అని కోదండరాంపై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.