: మీ సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళతా: పులివెందుల పర్యటనలో జగన్


వైసీపీ అధినేత జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయనను మధ్యాహ్న భోజన పథకానికి చెందిన మహిళలు కలిశారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణను బడా సంస్థలకు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని... తమకు న్యాయం చేయాలని వారు జగన్ ను కోరారు. ఏడు నెలలుగా తమకు జీతాలు, బిల్లులు ఇవ్వకపోవడమే కాకుండా, తమను తొలగిస్తున్నారని చెప్పారు. వారు చెప్పిన అన్ని విషయాలను జగన్ పేపర్ పై రాసుకున్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో లేవనెత్తడమే కాకుండా, కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళతానని ఈ సందర్భంగా జగన్ చెప్పారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు న్యాయం జరిగేలా చేస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు అనారోగ్యంతో బాధపడుతున్న వైసీపీ నేత రామకృష్ణారెడ్డిని జగన్ కలిశారు. ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. రామకృష్ణారెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

  • Loading...

More Telugu News