: పూరీ దగ్గర అసిస్టెంట్ ను అన్నాడు... హీరోయిన్ ఛాన్స్ ఇస్తానని మోసం చేశాడంటూ పోలీసులకు యువతి ఫిర్యాదు!


ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తుంటానని పరిచయమైన వ్యక్తి తనను మోసం చేశాడని ఓ యువతి హైదరాబాదు, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఖమ్మం జిల్లా రామాపురంకు చెందిన కృష్ణవేణి అనే యువతికి కొన్ని నెలల క్రితం విక్కీ అనే వ్యక్తి ద్వారా శ్రీనివాస్‌ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఆ సందర్భంగా తాను పూరీ జగన్నాథ్‌ దగ్గర అసిస్టెంట్‌ గా పనిచేస్తున్నానని, సినీ పరిశ్రమలో పెద్దవాళ్లతో పరిచయాలు ఉన్నాయని అన్నాడని తెలిపింది.

సినిమాల్లో హీరోయిన్ గా అవకాశం ఇస్తానని చెప్పడంతో...అతని మాటలు నమ్మి అతనికి డబ్బు ఇచ్చానని తెలిపింది. అవకాశం గురించి అడిగితే ‘కమిట్‌ మెంట్‌’ కావాలని అడిగాడని చెప్పింది. కమిట్ మెంట్ అంటే ఏంటని అడగడంతో తనతో గడపాలని కోరాడని, దానికి నిరాకరించిన తాను తన డబ్బు వెనక్కి ఇవ్వాలని అడిగానని, అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడని తెలిపింది. దీనిపై శ్రీనివాస్ మాట్లాడుతూ, తాను చిన్న సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటానని అన్నాడు. ఆమె ఎవరో తనకు తెలియదని, తాను ఆమెకు ఆఫర్ ఇప్పిస్తానని చెప్పలేదని తెలిపాడు.

  • Loading...

More Telugu News