: ప్రాణాలకు తెగించిన పాకిస్థాన్ పోలీసు... సోషల్ మీడియాలో వైరల్ వీడియో చూడండి


సినిమాల్లోని ఛేజింగ్ సీన్ ను తలపించే ఘటన ఒకటి పాకిస్థాన్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఘటన వివరాల్లోకి వెళ్తే, పాకిస్థాన్ లోని ఒక పట్టణంలో జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఒక లారీ వేగంగా వెళ్తూ ఒక వాహనాన్ని ఢీ కొట్టింది. దీనిని చూసిన ఒక పోలీసు అధికారి డ్రైవర్ ను పట్టుకునేందుకు ఆ వాహనాన్ని ఎక్కాడు. పోలీసును చూసిన డ్రైవర్ వాహనాన్ని మరింత వేగంగా పోనిచ్చాడు.

లోపలికెళ్లే అవకాశం లేక, పోలీసు డ్రైవర్ కేబిన్ లోకెళ్లేందుకు ఉపయోగించే లెగ్ గార్డ్ మీద కాలుంచి వేలాడుతూ డ్రైవర్ ను వాహనం ఆపాలని హెచ్చరించాడు. దీనిని చూసిన ఒక బైకర్ దీనిని షూట్ చేశాడు. వేగంగా వెళ్తున్న లారీ ముందుకు ఒక బైకర్ వెళ్లి ఆపడంతో డ్రైవర్ లారీని ఆపాడు. దీంతో అతనిని ఆ పోలీసు అదుపులోకి తీసుకున్నాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టగా, వైరల్ గా మారింది. ఆ పోలీసును పలువురు అభినందిస్తున్నారు. వీడియో చూడండి.

  • Loading...

More Telugu News