: విశాఖపట్నం విమానాశ్రయంలో వీరంగమేసిన జేసీ దివాకర్ రెడ్డి
అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఎక్కడుంటే అక్కడ సందడి ఉండాల్సిందే. తాజాగా, విశాఖ విమానాశ్రయంలో ఆయన వీరంగం వేశారు. ఇండిగో విమానంలో ఆయన హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. అయితే బోర్డింగ్ పాస్ జారీ చేసే సమయం అయిపోవడంతో సంబంధిత సిబ్బంది కౌంటర్ ను మూసేశారు. దీంతో, తీవ్ర ఆగ్రహానికి లోనైన జేసీ... కౌంటర్ లోని ప్రింటర్ ను తోసేశారు. ఆయన అనుచరులు ఆయనను ఆపడంతో, కాసేపటికి ఆయన చల్లబడ్డారు. అయితే జరిగిన విషయంపై ఎయిర్ పోర్టు సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.