: బ్యూటీషియన్ శిరీష మర్డర్ మిస్టరీలో సగం క్లారిటీ వచ్చింది!


హైదరాబాదులోని ఫిల్మ్ నగర్ లో ఆర్జీఏ స్టూడియోలో మేకప్ ఆర్టిస్ట్ గా పని చేస్తున్న శిరీష మర్డర్ మిస్టరీలో సగం క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. ఎస్సై ప్రభాకర్ రెడ్డికి శిరీషకి పరిచయం ఎలా అయింది అన్న విషయం కూడా వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళ్తే... ఆర్జీఏ స్టూడియో యజమాని రాజీవ్ కు తేజస్విని అనే ప్రేయసి ఉంది. అయితే రాజీవ్ తన సంస్థలో పని చేసే శిరీషతో చనువుగా ఉంటున్నాడని, వారి బంధం నేపథ్యంలో తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని తేజస్విని అనుమానించింది. దీంతో వారిద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ సమస్యను పరిష్కరించాలని రాజీవ్ తన స్నేహితుడు శ్రావణ్ ను కోరాడు. దీంతో శ్రావణ్ వారి మధ్య సమస్యను పరిష్కరించేందుకు తన స్నేహితుడు ఎస్సై ప్రభాకర్ ను రంగంలోకి దించాడు.

దీంతో ప్రభాకర్ ఈ సమస్యను సెటిల్ చేస్తానని సీన్ లోకి ఎంటరయ్యాడు. ఈ నేపథ్యంలో శిరీష, రాజీవ్, తేజస్విని, శ్రావణ్ హైదరాబాదుకు 71 కిలోమీటర్ల దూరం వెళ్లారు. అక్కడ పార్టీ చేసుకున్నారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న చర్చలు, లేదా ఇతర ఘటనల నేపథ్యంలో శిరీష తన భర్తకు లొకేషన్ షేర్ చేసింది. ఇంతవరకు జరిగింది తెలిసినా ఆ తరువాత ఏం జరిగిందన్నది మాత్రం మిస్టరీగా మారింది. అనంతరం చోటుచేసుకున్న ఘటనలే శిరీషది హత్యా? లేక ఆత్మహత్యా?...శిరీషపై ఎస్సై ప్రభాకర్ అత్యాచారం చేశాడా? లేదా?... ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. అన్న వివరాలపై క్లారిటీ రానుంది.  

  • Loading...

More Telugu News