: రేపటి నుంచి పెట్రోలు బంకుల సమ్మె లేనట్టే!


పెట్రోలియం కన్సార్టియం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 16 నుంచి నిరవధిక బంద్ కు వెళ్తున్నామని పెట్రోలు బంకుల యాజమాన్యం తెలిపిన సంగతి తెలిసిందే. అయితే తమ బంద్ ఆలోచనను పెట్రోల్ బంకుల యజమానులు విరమించుకున్నారు. రోజువారీ పెట్రోల్, ధరల సవరణ పద్ధతిని విరమించుకుంటున్నామని కేంద్ర పెట్రోలియం శాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించడంతో బంద్ ఆలోచను పక్కనపెట్టామని తెలిపారు.

 రోజువారీ ధరల సవరణ ఆమోదయోగ్యం కాదని, అందుకు అవసరమైన సాంకేతికత అందరికీ అందుబాటులో లేదని కేంద్ర మంత్రితో జరిగిన చర్చల సందర్భంగా పెట్రోల్ బంకుల యజమాన్య సంఘం తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న విధానాన్నే అమలు చేస్తామని, రోజువారీ సవరణ పద్ధతిని అమలు చేయడం లేదని ఆయన ప్రకటించారు. దీంతో వారి బంద్ ప్రకటనను ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News