: తొలివికెట్ కోల్పోయిన పాకిస్థాన్
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈ రోజు జరుగుతున్న ఇంగ్లండ్, పాకిస్థాన్ మ్యాచ్‌లో 212 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 118 పరుగల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. పాకిస్థాన్ ఓపెనర్లు అజర్, జమాన్ ధాటిగా ఆడి హాఫ్ సెంచరీలు నమోదు చేసుకున్నారు. అనంతరం జమాన్ 57 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇంగ్లండ్ ఆటగాడు రషీద్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. మరో ఓపెనర్ అజార్ 55 పరుగులతో క్రీజులో ఉన్నాడు. పాకిస్థాన్ స్కోరు 22 ఓవర్లకి 122గా ఉంది. జమాన్ అవుట్ అయిన తరువాత క్రీజులోకి బాబర్ వచ్చాడు.