: మీడియా ఇంత‌గా వైర‌ల్ చేస్తుంద‌ని అనుకోలేదు: ‘సినిమాల్లో న‌టించ‌ను’ ట్వీట్‌పై మ‌ంచు మ‌నోజ్ వివ‌ర‌ణ


సినిమాల నుంచి తప్పుకుంటున్నట్లు ఓ ట్వీట్ చేసి టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ ఈ రోజు త‌న అభిమానుల‌ను ఆశ్చ‌ర్యంలో ముంచెత్తిన విష‌యం తెలిసిందే. ఇక ఈ ట్వీట్ తెలుగు మీడియాతో పాటు జాతీయ మీడియాల వెబ్ సైట్ లలోనూ వ‌చ్చేసింది. మంచు మ‌నోజ్ ఇక‌పై సినిమాల్లో న‌టించ‌బోన‌ని ఇటువంటి సంచ‌ల‌న నిర్ణ‌యం ఎందుకు తీసుకున్నాడ‌ని సినీ అభిమానుల్లో ఎంతో చ‌ర్చ కొన‌సాగింది. అయితే, మంచు మ‌నోజ్ ఆ ట్వీట్‌ను మ‌రో ఉద్దేశంతో చేశాడ‌ట‌. మీడియాలో మ‌రీ ఇంత‌గా ఆ ట్వీట్ వైర‌ల్ కావ‌డంతో చివ‌ర‌కు తాను చేసిన ట్వీట్ పై ‌ఆయనే ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశాడు. తాను ఆ ట్వీట్‌ను డిలీట్ చేసిన అనంత‌రం కొద్దిసేప‌టికే మంచు మ‌నోజ్ వివర‌ణ ఇచ్చుకున్నాడు.

తాను చేయబోయే కొత్త సినిమా ప్రకటించడానికే ఇలా వినూత్నంగా ఆలోచించి, ఆ ట్వీట్ చేశాన‌ని మంచు మనోజ్ చెప్పాడు. మీడియా నుంచి ఇంత అనూహ్య స్పందన వస్తుందని అనుకోలేదని ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశాడు. చాలా మంది త‌న‌ పోస్ట్‌ను రకరకాలుగా అర్థం చేసుకున్నారని, కానీ అది ఇలా అవుతుందని అనుకోలేదని చెప్పాడు. ఈ దెబ్బ‌తో మంచుమ‌నోజ్ తాను ప్ర‌క‌టించాల‌నుకున్న విష‌యాన్ని కాస్త వాయిదా వేసేశాడు. త‌న‌ కొత్త సినిమా గురించి చెప్పాలంటే ఈ వేడి చల్లారాలని, ఓం శాంతి అని ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నాడు. మొత్తానికి మంచు మ‌నోజ్ ట్వీట్ ఇంత‌గా కంగారు పెట్టించింది. 

  • Loading...

More Telugu News