: కుక్కునూరు పోలీస్‌స్టేషన్‌లో తుపాకీతో కాల్చుకుని మరో ఎస్ఐ ఆత్మహత్య
ఓ ఎస్ఐ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం కుక్కునూరులో చోటు చేసుకుంది. ఆ పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న ప్రభాకర్ ఈ రోజు ఉదయం ఒక్కసారిగా తన తుపాకీతో కాల్చుకోవడంతో కలకలం చెలరేగింది. ఆయన గతేడాదే విధుల్లోకి చేరారు. ఇదే కుక్కునూరు పోలీస్ స్టేషన్‌లో గతంలోనూ రామకృష్ణారెడ్డి అనే మరో ఎస్ఐ ఇదే విధంగా ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో పోలీస్ వర్గాల్లో ఈ ఘటనలు అలజడి రేపుతున్నాయి. ప్రభాకర్ ఆత్మహత్యకు గల కారణాల గురించి తెలియాల్సి ఉంది.