: పని చేస్తున్న కార్యాలయంలో బెడ్ పై బ్యూటీషియన్ మృతదేహం... ఆత్మహత్య అంటున్న యజమాని


హైదరాబాద్ లోని ఆర్జే ఫొటోగ్రఫీలో బ్యూటీషియన్ కమ్ హెచ్ఆర్ మేనేజర్ గా పని చేస్తున్న అరుమిల్లి విజయలక్ష్మి అలియాస్ శిరీష (28) ఆఫీసులోని ఓ గదిలో బెడ్ పై విగతజీవిగా కనిపించడం కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, ఈ యువతి, సోమవారం రాత్రి 8:40 గంటల సమయంలో తన భర్త సతీష్ చంద్రకు ఫోన్ చేసి, ఇంటికి ఆలస్యంగా వస్తానని చెప్పింది. ఆపై రాత్రంతా ఇంటికి రాలేదు. మంగళవారం ఉదయం తాను పనిచేసే ఆశ్రయ్ - ఆకృతి పాఠశాలకు సతీష్ వెళ్లిపోయాడు.

ఆపై ఫొటోగ్రఫీ కార్యాలయం నుంచి పోలీసులకు ఫిర్యాదు అందింది. శిరీష ఆత్మహత్య చేసుకుందని, ఫ్యాన్ కు ఉరేసుకోవడంతో, తానే కిందకు దింపి మంచంపై పడుకోబెట్టానని యజమాని వల్లభనేని రాజీవ్ చెప్పారు. సమాచారాన్ని శిరీష భర్తకు వివరించిన పోలీసులు అతన్ని పిలిపించారు. తన భార్య ఆత్మహత్య చేసుకునేంత పిరికి అమ్మాయి కాదని, ఆమె మరణం వెనుక తనకు ఎన్నో అనుమానాలు ఉన్నాయని సతీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసు వర్గాలు రాజీవ్ తో పాటు, సోమవారం రాత్రి అక్కడే ఉన్న మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News