: ముంబై కాలేజీ అమ్మాయిల హాస్టల్ లో చిరుత


ఇదొక షాకింగ్ వీడియో ఫుటేజ్. ముంబైలోని వెటర్నరీ కళాశాల అమ్మాయిల హాస్టల్ లోకి ఓ చిరుత ప్రవేశించింది. సీసీటీవీ ఫుటేజ్ లో నిక్షిప్తమైన దృశ్యాలను బట్టి, హాస్టల్ లోకి ప్రవేశించిన చిరుత, కాపలా కుక్కలపై దాడికి దిగింది. హాస్టల్ మెట్లపై నుంచి ఓ శునకాన్ని చిరుత తరిమింది. దానిపై దాడికి దిగింది. ఆ శునకాన్ని రక్షించేందుకు వచ్చిన మరో శునకం, చిరుతను చూసి భయంతో వెనక్కు తప్పుకుంది. ఆపై గోరేగావ్ అటవీ ప్రాంతంలోకి చిరుత పారిపోయింది. సంజయ్ గాంధీ జాతీయ పార్కు సమీపంలోనే ఈ హాస్టల్ ఉండటంతో, పలు క్రూర జంతువులు క్యాంపస్ లోకి వస్తున్నాయని, రాత్రుళ్లు వాటి అరుపులతో తాము భయపడుతున్నామని హాస్టల్ బాలికలు తెలిపారు. అది రాత్రి పూట కావడం, అమ్మాయిలెవరూ చిరుత కంట కనబడకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.

  • Loading...

More Telugu News