: ఆమరణ నిరాహార దీక్షకు దిగిన తెలుగు సినీ దర్శకుడు రాజేష్ సాయి


పెద్ద సినిమాల ధాటికి చిన్న సినిమాలకు మనుగడ లేకుండా పోయిందని, ప్రభుత్వం కనీసం 50 థియేటర్లను తన అధీనంలో ఉంచుకుని, వాటిల్లో చిన్న చిత్రాలను ప్రదర్శించే వీలును కల్పించాలని డిమాండ్ చేస్తూ, సినీ రచయిత, దర్శకుడు రాజేష్‌ సాయి ఫిలింనగర్‌ లోని ఫిలిం చాంబర్‌ కార్యాలయం ఎదుట చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష బుధవారం నాటికి మూడవ రోజుకు చేరుకుంది.

వంద కోట్ల రూపాయలతో నిర్మితమవుతున్న సినిమాల్లానే కోటి రూపాయలతో తీసే సినిమాలు కూడా లోకేషన్లకు అద్దెలను చెల్లిస్తున్నాయని, పబ్లిసిటీ నిమిత్తం ఖర్చు పెడుతున్నాయని, అయితే థియేటర్లు లభించని ఘోర పరిస్థితిలో నష్టాలు వస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న సినిమా బాగున్నా పెద్ద సినిమా కోసం పక్కకు నెట్టేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన, తాను నిర్మించిన 'గేట్' చిత్రం ఇదే పరిస్థితుల్లో ఉందని, నిర్మాతల నుంచి తనకు రావాల్సిన డబ్బు కూడా అందలేదని ఆయన ఆరోపించారు. చాంబర్ పెద్దలు తనకు న్యాయం చేయాలని అభ్యర్థించారు.

  • Loading...

More Telugu News