: జూలై 12 నుంచి ఆగస్టు 11 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలోని కమిటీ ఈనెల 20వ తేదీ తరువాత పార్లమెంటు సమావేశాలపై తుది నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీపీఏ) ముందు ప్రతిపాదన ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో పార్లమెంటు వర్షకాల సమావేశాలు కొంచెం ముందుగా ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలు జూలై 12వ తేదీ నుంచి ప్రారంభమై ఆగస్టు 11వ తేదీ వరకు జరగనున్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.