: ‘డీజే’ ఆఖరి షాట్ పూర్తయింది: హరీశ్ శంకర్


టాలీవుడ్ యంగ్ హీరో అల్లు అర్జున్‌, ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకుంటున్న‌ ‘డీజే’ సినిమాలోని చివ‌రి షాట్ పూర్త‌యింద‌ని హ‌రీశ్ శంక‌ర్ ఈ రోజు త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలిపాడు. అల్లు అర్జున్‌, నిర్మాత‌ దిల్ రాజుల‌కి ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్న‌ట్లు పేర్కొన్నాడు. వారితో ఈ జ‌ర్నీ కొన‌సాగిన తీరుప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశాడు. ఈ సంద‌ర్భంగా దిల్ రాజు, అల్లు అర్జున్‌ల‌తో దిగిన  సెల్ఫీని ఆయ‌న పోస్ట్ చేశాడు. ఈ సినిమా ఈ నెల 23న విడుదల కానుంది.     

  • Loading...

More Telugu News