: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో మళ్లీ సత్తాచాటిన విరాట్ కోహ్లీ
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ ఆటగాడు, కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి సత్తా చాటాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో రెండో మ్యాచులో మినహా కోహ్లీ మిగతా రెండు మ్యాచుల్లో కోహ్లీ రాణించిన విషయం తెలిసిందే. దీంతో వన్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో తన ర్యాంకును మెరుగు పరుచుకుని మరోసారి అగ్రస్థానానికి ఎగబాకాడు.
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం ర్యాకింగ్స్ లో సౌతాఫ్రికా బ్యాట్స్‌మన్ ఏబీ డీ విల్లియర్స్, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్‌లను వెనక్కునెట్టేశాడు. ప్రస్తుతం కోహ్లీ వన్డే ర్యాంకింగ్స్‌లో 861 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, డేవిడ్ వార్నర్. కోహ్లీ కంటే ఒకే ఒక్క పాయింట్ వెనకబడి 861 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ఏబీ డీ విల్లియర్స్ 847 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఆ తరువాతి స్థానాల్లో వరుసగా జో రూట్, కానె విలియమ్సన్ ఉన్నారు.