: అచ్చం విరాట్ కోహ్లీలాగే ఉన్నాడు.. పిజ్జా హట్‌లో పనిచేస్తున్నాడు.. మీరూ చూడండి!
ఓ యువకుడు అచ్చం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలాగే ఉన్నాడు.. ఓ పిజ్జా హట్‌లో బిజీబిజీగా పనిచేసుకుంటున్నాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. మొదట ఈ వీడియోను చూస్తోన్న నెటిజన్లు విరాట్ కోహ్లీ పిజ్జా హట్‌లో పనిచేస్తున్నాడేంటని అనుకుంటున్నారు. ఆ తరువాత అతడు కోహ్లీ కాదని తెలుసుకుంటున్నారు. పాకిస్థాన్‌లోని కరాచీలోని ఓ పిజ్జా ఔట్‌లెట్‌లో పనిచేస్తోన్న ఆ యువకుడి వీడియోను ఫేస్‌బుక్ లో పోస్టు చేయడమే ఆలస్యం... ఎంతో మంది ఈ వీడియోను షేర్ చేస్తూ 'కోహ్లీ ఏం చేస్తున్నాడో చూడండి' అంటూ నవ్వుకుంటున్నారు.