: తెలంగాణ వైసీపీ ప్లీనరీ.. హాజరుకానున్న జగన్
ఈ నెల 22న తెలంగాణ వైసీపీ ప్లీనరీ హైదరాబాదులో జరగనుంది. ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత జగన్ హాజరవుతారని టీవైసీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 8 వేల మందితో ప్లీనరీ నిర్వహిస్తామని చెప్పారు. పార్టీని బలోపేతం చేసే దిశగా ప్లీనరీలో చర్చిస్తామని... ముఖ్యమంత్రి కేసీఆర్ వైఫల్యాలపై కూడా మాట్లాడతామని తెలిపారు. కేసీఆర్ వల్లే టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి భూ కుంభకోణానికి పాల్పడ్డారని అన్నారు. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఎనీవేర్ కరప్షన్ గా మారిందని మండిపడ్డారు. మియాపూర్ భూ కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.